శ్రావణమాసం చివరి సోమవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారికి రికార్డు స్థాయిలో రూ.41 లక్షల ఆదాయం సమకూరింది. రాజన్న దర్శనానికి 75 వేల మందికిపైగా భక్తులు రావడంతో సోమవారం అర్ధరాత్రి వరకు అనుమతించారు. కోడె మొక్కుల టికెట్ల ద్వారా రూ.14.58 లక్షలు, ప్రసాదాల ద్వారా రూ.12.33లక్షలు, శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా రూ.6.33 లక్షలు, మెయిన్ బుకింగ్ ద్వారా రూ.3.25 లక్షలు, ధర్మశాలల ద్వారా రూ.1.29లక్షలు సమకూరాయి.