ఓ కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్లు అయినప్పటికీ పెళ్లైన జంటను ప్రభుత్వం విడదీయడం సరికాదని పేర్కొంది. బీహార్‌కు చెందిన ఓ ముస్లిం బాలిక, ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చింది. మైనర్ అనే పేరుతో వారిని విడదీయొద్దని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం రజస్వల అయిన బాలికలు పెళ్లి చేసుకోవచ్చని పేర్కొంది.