కర్ణాటకలోని కృష్ణరాజపురంలో దారుణం జరిగింది. ఐదేళ్ల క్రిందట ఓ యువతికి నకిలీ స్వామీజీ ఆనందమూర్తి పరిచయమయ్యాడు. ఆమెను ఆశ్రమానికి రప్పించి, ఆపై మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడు. భార్య లత ఈ దారుణాన్ని ఫొటోలు, వీడియోలు తీసింది. ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి, ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఇటీవల యువతి పెళ్లి కూడా చెడగొట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో స్వామీజీ దంపతులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.