జమ్మూకశ్మీర్‌లో గత 24 గంటల వ్యవధిలో 5 సార్లు భూకంపాలు సంభవించాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 2:20 గంటలకు కత్రాకు తూర్పున మొదటి భూకంపం సంభవించింది. భూమికి 10 కి.మీ.లోపల ఇది జరిగింది. మొదటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తాజాగా తెలిపింది.