సారవకోట మండలంలోని చిన్నగుజ్జువాడ గ్రామంలో గల బిఎస్ఎన్ఎల్ టవర్ గత నాలుగు నెలలుగా పని చేయని వైనం వెలుగు చూసింది. విషయాన్ని అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. సెల్ఫోన్లు సిగ్నల్స్ అందకపోవడంతో ఈ గ్రామానికి సమాచార వ్యవస్థ నిలచి పోయింది. వలస వెళ్ళినవారు, దూర ప్రాంతంలో ఉద్యోగం విద్యాభ్యాసం కోసం వెళ్లిన వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం పోయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా బిఎస్ఎన్ఎల్ అధికారులు సెలటవర్ను మరమత్తులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.