పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పేర్కొన్నారు. లావేరు మండలం లోపెంట సచివాలయం పరిధిలోని హనుమంతు పురం, సహాపురం గ్రామాల్లో 61వ రోజు గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కులమతాలు, పార్టీలు, వర్గాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తుందని అన్నారు. అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు నుంచి లబ్ధి పొందని పేదలు తమ దృష్టికి తీసుకొస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆయా కుటుంబాలు పొందిన లబ్ధిని వివరించడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారు ప్రజలకు వివరించారు.