నెల్లూరు రూరల్ పరిధిలోని 31 డివిజన్ అక్కచెరువుపాడు, ఓగూరుపాడు ప్రాంతాలలో "గడప గడపకు - మన ప్రభుత్వం" కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా.? అంటూ ప్రతీ ఒక్కరినీ అడుగుతూ. ప్రతి గడపకు తిరుగుతూ ఒకవేళ ఎవరికి అయినా అందకపోతే తన దృష్టికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 31 వ డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల, డివిజన్ అధ్యక్షుడు బత్తల కృష్ణ, స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.