రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి సాధారణ స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం రాత్రి 3, 80, 103 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే బ్యారేజీ వద్ద రాత్రి 9. 20 అడుగులకు నీటిమట్టం చేరింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 12, 700 క్యూసెక్కుల నీరు వదిలారు.