ఇబ్రహీంపట్నం సచివాలయం-1 పరిధిలో గురువారం ఉదయం గడప గడపకు మన ప్రభుత్వం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల చేకూరిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి అధికారులకు అదేశాలు ఇస్తున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.