ఫేక్ ప్రొఫైల్ DP లతో అపరిచిత ఫోన్ నెంబర్ ల నుండి వచ్చే నగదు అభ్యర్దనలకు స్పందించకండి అని కాకినాడ జిల్లా, పోలీస్ శాఖా తెలియజేసింది. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి.
సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా కొందరు సైబర్ నేరాగాళ్ళు జిల్లా స్థాయి ముఖ్య అధికారులు మరియు ప్రైవేటు సంస్థల యజమానుల, స్నేహితుల ఫొటోలను వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా అకౌంట్ ల DP లుగా పెట్టుకొని క్రింది స్థాయి ఉద్యోగులతో, స్నేహితులతో చాటింగ్ ద్వారా మాట్లాడుతూ అత్యవసరంగా డబ్బులు అవసరమని, PhonePay, GooglePay మోదలగు UPI ల ద్వారా డబ్బులు అర్జెంటుగా పంపమని అభ్యర్దిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయమై జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS గారు మాట్లాడుతూ జిల్లా ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు అందరూ సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరికైన ఈ విధంగా డబ్బులు అడుగుతూ అభ్యర్ధనలు వస్తే ముందుగా సంబంధిత వ్యక్తితో మాట్లాడి నిర్ధారించుకోవాలని, ఓకవేళ ఎవరైనా ఇటువంటి సైబర్ నేరానికి గురై డబ్బులు కోల్పోతే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫోన్ చేయాలని SP గారు ఈ ప్రకటన ద్వారా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేయడమైనది.