గుంటూరు: ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 27వ తేదీ నుంచి రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. మచిలీపట్నం- కర్నూల్, (07067) మంగళ, గురు, శనివారాల్లో మచిలీపట్నంలో 17: 00 గంటలకు బయలుదేరి గుంటూరు 19: 50, కర్నూలు 6: 30 గంటలకు చేరుతుంది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వచ్చే గోల్కొండ ఎక్స్ప్రెస్(17202) సికింద్రాబాద్ లో 12: 30 గంటలకు ప్రారంభమై గుంటూరు21: 30 గంటలకు చేరుతుంది.