సంపూర్ణ పోషణ, మధ్యాహ్న భోజనం కార్యక్రమాలపై సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. స్కూళ్లకు, అంగన్వాడీలకు బియ్యాన్ని సరఫరా చేసే ముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని, బియ్యం బ్యాగులపై మధ్యాహ్నం భోజనం లేదా ఐసీడీఎస్ బియ్యంగా లేబుల్స్ వేయాలని, ప్రతినెలా నాణ్యతా పరీక్షలు జరగాలని ఆదేశించారు. గుడ్లను స్టాంపింగ్ లేకుండా పంపిణీచేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.