భారత్‌లో తలసరి ఉప్పు వినియోగం రోజులో 11 గ్రాములుగా ఉంది. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం.. ఒక వ్యక్తి రోజులో 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. ముఖ్యంగా మనం వినియోగించే ఉప్పులో అధిక భాగం ప్రాసెస్డ్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్స్ నుంచే ఉంటోంది. ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.