ఏపీ సీఎం జగన్ గురువారం కృష్ణా జిల్లా పెడనలో పర్యటించారు. చేనేత వస్త్రాల స్టాల్స్ ను సందర్శించారు. 4వ విడత నేతన్న నేస్తం నిధులను విడుదల చేశారు. 80,546 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 193.31 కోట్లు జమ చేశారు. ఈ పథకం కింద మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు ఆర్థికసాయం అందిస్తున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి రూ.96 వేల సాయం అందించారు.