చంద్రబాబు పర్యటనను అడ్డుకునే కుట్రలు సిగ్గుచేటని టిడిపి సీనియర్ నేత ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీపీ కార్యకర్తపై చెయ్యి ఎత్తిన ఏ ఒక్కడినీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. టీడీపీ కార్యకర్త రక్తం చూసిన ఎవరినీ వదలబోమని అన్నారు. తమ పార్టీ కార్యకర్త నుంచి కారిన ప్రతి రక్తపు చుక్క రేపు చురకత్తి కాబోతోందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ కు చుక్కలు చూపిస్తామన్నారు. టీడీపీ కార్యకర్త తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పారు. జగన్ రెడ్డికి సిగ్గుందా? అని ఆయన ప్రశ్నించారు. సిగ్గున్న వాళ్లు పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ ను ఎలా ధ్వంసం చేస్తారని అడిగారు.