బ్యాంకులకు టోకరపెట్టిన కోట్ల రూపాయలను ఎంపీ రఘురామ కృష్ణంరాజు నుంచి కక్కించాలని సిబిఐ కోరనున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఇటీవల రఘురామ ఎన్నికల సర్వే అంటూ కొన్ని ఫలితాలను వెల్లడించడం పట్ల విజయసాయి ఘాటుగా స్పందించారు.
ప్రభుత్వ బ్యాంకుల్లో అమాయక డిపాజిటర్లను నిలువునా ముంచాక, ఇప్పుడు రఘురామ మాయలమారి రాజకీయ పండితుడి అవతారం ఎత్తాడని విమర్శించారు. పనీపాటా లేకపోవడంతో అతడి మానసిక ఆరోగ్యం గాడితప్పిందని, అందుకే ఢిల్లీలో కూర్చుని ఏపీ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రఘురామను తలకిందులుగా వేళ్లాడదీసి ప్రభుత్వ బ్యాంకులకు అతడు బకాయిపడిన రూ.1000 కోట్లను కక్కించాలని సీబీఐని కోరుతున్నట్టు విజయసాయి ట్వీట్ చేశారు.