పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పేర్కొన్నారు. లావేరు మండలం లోపెంట సచివాలయం పరిధిలోని బుధవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయా కుటుంబాలకు చేకూరిన లబ్ధిని వివరించారు. కుల మతాలు వర్గాలు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.