శ్రీకాకుళం జిల్లాలో 2022-23 సంవత్సరంలో 1, 294 మందికి రూ. 3. 10 కోట్లను నేతన్న నేస్తంగా అందించినట్లు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం ఆయన మాట్లాడుతూ 2019-20 సంవత్సరంలో 1, 457 మందికి రూ. 3. 50 కోట్లు, 2020-21లో 1, 775 మందికి రూ. 4. 26 కోట్లు, 2021-22 సంవత్సరంలో 1, 601 మందికి రూ. 3. 85 కోట్లు అందించామని, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు పథకాల్లో ఎక్కువ లబ్ధి అందించే పథకమన్నారు.