శ్రీకాకుళం జిల్లా, టెక్కలి: కోటబొమ్మాళి మండలం, మాసాహెబ్ పేట సచివాలయ పరిధి కమలనాభపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వ హయాంలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. అలాగే ప్రజల కోసం పనిచేస్తున్న జగనన్నకు అందరం అండగా ఉండాలని కోరారు.
అనంతరం ఇంటింటికి వెళ్లి ఒక్కొక్క ఇంటికి ఎంత మేరకు సంక్షేమ పథకాలు అందయో వివరించారు. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి మండల అధ్యక్షులు నూక సత్యరాజు, ఎంపీటీసీ పొన్నాన కమల కుమారి, పిఎసిఎస్ అధ్యక్షులు బాడాన మురళి, వైస్ ఎంపీపీ లు బోయిన నాగేశ్వరరావు, దుక్క రామకృష్ణ రెడ్డి, జిల్లా అగ్రికల్చర్ అడ్వైజర్ కమిటీ మెంబెర్ కవిటి రామరాజు, వైయస్ఆర్ సి పి నాయకులు గెడ్డవలస నాగు, మొజ్జాడ శ్రీను, అక్కురాడ సురేష్, దుంపల మురళీ, కార్పోరేషన్ డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ పార్టీనాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.