రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్‌రెడ్డి నగరంలో పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అమెరికాకు చెందిన పార్లె ఫర్ ది ఓషన్స్ సంస్థతో శుక్రవారం జరుగనున్న ఎంఒయు ఒప్పందం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. కన్వెన్షన్ సెంటర్ ఆవరణలో పార్లె సంస్థ ఏర్పాటు చేయనున్న స్టాల్స్ ను ఆయన సందర్శించి పలు సూచనలు జారీ చేశారు. కన్వెన్షన్ లోపలి భాగంలోని వేదికను, సిటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.