కుక్క అంటే అందరికీ గుర్తొచ్చేది విశ్వాసం. ఓ ముద్ద అన్నం పెడితే జీవితాంతం అవి మనల్ని వదలవు. దేశ రక్షణలోనూ అవి తనదైన ముద్రను వేస్తున్నాయి. ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది అంటాం కదా.. అదే ఈరోజు. రెస్క్యూ డాగ్స్ కు సురక్షితమైన వాతావరణం అందించాలనే ఉద్దేశ్యంతో వాటి ప్రాముఖ్యతను అందరికీ చెప్పడానికి, వాటి దత్తత గురించి అవగాహన పెంచడానికి ప్రతి ఏటా ఆగస్టు 26న అంతర్జాతీయ కుక్కల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.