వైయస్సార్ నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమ చేసిన సందర్భంగా వైయస్సార్సీపి నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గురువారం ముద్దనూరు పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులకు నాలుగో విడతలు ఒక్కొక్కరికి రూ. 24 వేలు ఆర్థిక సాయం అందించడం సంతోషించతగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, పార్టీ నాయకులు సుబ్బయ్య, దత్తాత్రేయ, కృష్ణమూర్తి, రామయ్య, శేఖర్, మాలయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.