పులివెందుల వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అందరు సహక రించాలని పులివెందుల రూరల్ సీఐ బాలమద్ది లేటి సూచించారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరే కంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీ సుకుంటామని ఆయన హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఆయన సమావే శంలో సూచనలిచ్చారు. వినాయక ప్రతిమలు ఏర్పాటుచేసేవారు ముందుగా ఆయాపరిధి పోలీసస్టేషన్ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. విగ్రహాల ఏర్పాటులో ప్రజల రాకపోక లకు ఇబ్బంది కలుగకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు అధికారులు ఆయా ప్రాం తాలు సందర్శించాలని ఆదేశించారు. ప్రజలకు అ సౌకర్యం కలిగిన వెంటనే తొలగించాలని సూచించారు.
గాలి, వర్షాలకు మండపాలు కూలకుండా విద్యుత్ షార్ట్సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా న నిర్వాహకులు చూడాలన్నారు. మండపాలలో అధికారికంగా విద్యుత్ ఏర్పాటు చేసుకునేలా సం బంధిత విద్యుత్ అధికారులు అనుమతి తప్పకుం డా తీసుకోవాలన్నారు. మండపాల పరిసరాలలో భక్తిభావనకు విరుద్ధమైన మద్యం, జూదం, రికా ర్డింగ్ డ్యాన్సులు వంటివి చేపట్టరాదన్నారు. రాజ ప్రసంగాలు, నినాదాలకు తావు ఇవ్వరాదని, వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించరనాద న్నారు. భారీ మండపాలు ఏర్పాటు చేసుకునే వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
బలవంతంగా డబ్బు సేకరణ చేయరాదని హెచ్చ రించారు. మండపాల వద్ద టపాసులు, పేలుడు వస్తువులు ఉంచరాదన్నారు. రాత్రి వేళల్లో తప్పని సరిగా ఒకరిని మండపం వద్ద కాపలాగా ఉంచా లన్నారు. ప్రతిమలు ఏర్పాటుచేసిన ప్రదేశం నుం చి నిమజ్జనం చేసే వరకు అన్ని ఏర్పాట్లు చేయా లన్నారు. ముందుగా అగ్నిప్రమాదాల నివారణకు నీళ్లు, బకెట్తో ముంచినవి ఉంచాలన్నారు. మండ పాల ఏర్పాటు విషయంలో స్థానికులకు ఇబ్బంది. లేకుండా ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సౌండ్ సిస్టం వినియోగించాలన్నారు. మండపాల పరిసరాలలో టీజింగ్, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా సంబంధిత అధికారులకు ఆదేశించారు.