రాష్ట్ర ప్రజలకు మహరాష్ట్ర ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. 75 ఏళ్ల వయసు దాటిన వారికి ఆర్టీసీ సేవలు ఉచితంగా అందించనుంది. ఈ విషయాన్ని రోడ్డు రవాణా శాఖ వెల్లడించింది. 75 ఏళ్లు దాటిన వారందరు స్టేట్ రన్ బస్సులు, ఎస్టీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మార్పులను రాష్ట్ర ఆర్టీసీ ఆగస్టు 26 నుంచి అమలులోకి తీసుకువచ్చింది. అంతేకాక 65-75 ఏళ్ల మధ్య ఉన్న వారికి కొన్ని బస్ టికెట్ ధరల్లో 50% రాయితీ ఇవ్వనుంది.