జల వనరుల పెంపు బాధ్యత రైతులదే అని కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎంకె జ్యోత్స్న తెలిపారు. శుక్రవారం కలికిరి కెవికెలో జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా జలవనరుల సంరక్షణపై, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిహెచ్ఓ శ్రీహరి ప్రసాద్, డిఎంఏపీఎంఐపి నారాయణ, డ్వామా ఏపిడి మధు బాబు, రైతులు పాల్గొన్నారు.