గడప గడపకు కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు సొంత పార్టీ వారి చేతిలో పరాభవం. తన రాజకీయాల కోసం, తన గెలుపు కోసం శాయశక్తులా కృషి చేసిన వారినే వేధింపులకు గురి చేస్తూ, తమ పిల్లలను అక్రమ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేశాడు అంటూ శాపనార్ధాలు పెట్టిన ముస్లిం మహిళలు. ఇది ఇలా ఉండగా , కొన్ని చోట్ల మాత్రం అభిమానం చూపుతూ ప్రజలు స్వాగతం పలికారు.
ఇటువంటి సమస్యలు అన్ని కూడా స్థానికంగా పనిచేస్తున్న నాయకులకి ప్రజలకి జరిగిన అంతర బేదాభిప్రాయాల వలన కలిగినవే కానీ, నా దృష్టికి ఎప్పుడు రాలేదు, త్వరలోనే అందరి సమస్యలు తీర్చి పరిస్థితి చక్కపెట్టే ప్రయత్నం చేస్తాము అని తెలియజేసారు.