నేను సీనియర్ నాయకుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు మూడు దపాలుగా సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు మూడు దపాలుగా సీఎంగా ఉన్న సమయంలో కుప్పం నియోజకవర్గ గుర్తుకు రాలేదా, ప్రజలు విసిగిపోయి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తు ఓడించడంతో ఆగమేఘాలపై కుప్పంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడమే కాకుండా ఇల్లు కట్టుకోవాలని చంద్రబాబుకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని రాయచోటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయభాస్కర్ అన్నారు. శనివారం అయనా స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లో రాష్ట్రమని ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు నాలుగు సంవత్సరాలు పాటు పేద ప్రజలను పట్టించుకోని టిడిపి అధినేత ఎన్నికలకు 9 నెలల ముందు (జులై 11, 2018) అన్నా క్యాంటీన్ లు ఓపెన్ చేయడం ఎన్నికల కోసం కాదని ఆయన ప్రశ్నించారు.
2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం నాలుగున్నరేళ్ల తరువాత అన్న క్యాంటీన్ లు ప్రారంభించి కంటి తుడుపు చర్యగా పేదలకు భోజనం పెట్టడం దారుణమైన విషయం అన్నారు. అన్నా క్యాంటీన్లు లేక జనం ఇప్పుడు అల్లాడుతోంటే అంతక ముందు ప్రజలు అన్నమే తినలేదా అని తెలుగు తమ్ములను ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ల ద్వారా ఒక్కో కాంటీన్ లో రూ. 20 లక్షల చొప్పున మొత్తంగా అన్న కాంటీన్ ల పేరిట రూ. 53 కోట్ల మేర అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ తేల్చిందన్నారు. నరసరావుపేటలోని ఓ క్యాంటీన్ నుండి రూ. 5 లు భోజనాన్ని రోజూ కోడెల చౌదరి కుమార్తెకు చెందిన సేఫ్ ఫార్మా కి తరలించి అందులోని ఉద్యోగస్తులకు రూ. 20 నుండి రూ. 40 రూపాయల చొప్పున అమ్ముకున్న ఘన చరిత్ర టీడీపీదేనన్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు అన్ని పేదలు ఉండే చోట కాకుండా బాగా ధనికులు ఉండే చోట క్యాంటీన్ లు పెట్టి రోజుకు 100 మందికి భోజనాలు పెట్టి 350 మందికి భోజనాలు పెట్టినట్టుగా టీడీపీ నాయకులు వసూలు చేసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీలాగా అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లి కాదని, ఎన్నికల సమయంలో పాదయాత్ర సమయంలో ఏమి చెప్పారో అది తూచా తప్పకుండా అమలు చేస్తూ చక్కని హామీలను సైతం నెరవేర్చిన ఘనత దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు.