అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అధికారంలో ఉన్నపుడు దేశానికి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను తరలించారని ఎఫ్ బీఐ తనిఖీల్లో తేలింది. తన ఇంట్లో మ్యాగజైన్లు, వార్తా పత్రికల మధ్య కలిపేశారని పేర్కొంది. ట్రంప్ కు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్ లో ఎఫ్ బీఐ సోదాలు చేపట్టింది. సోదాల్లో 15 బాక్సుల్లో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్లు తాజాగా విడుదల చేసిన అఫిడవిట్‌లో తెలిపింది.