చిత్తూరు: కుప్పంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు పై దాడులకు యత్నించడం తీవ్రంగా ఖండిస్తున్నామని మదనపల్లె నియోజకవర్గ టీడీపి నాయకులు జయరాం నాయుడు శనివారం అన్నారు. గత 33 సంవత్సరాలుగా కుప్పం ఎమ్యెల్యేగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలపై కుప్పంలో పర్యటన చేస్తే ఓర్వలేని వైసీపీ నాయకులు దౌర్జన్యంకు పాల్పడడం సరికాదన్నారు.