తేనెను కాలిన గాయాల పైన పూస్తే మచ్చలు పడవు. మొటిమల మీద రాస్తే తగ్గుతాయి. తేనె పూయడం వల్ల పెదాలు పొడిబారవు. తేనె చర్మకాంతిని పెంచుతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా మారితే తేనె పూయాలి. పరగడుపున తేనె, నిమ్మరసం కలిపి తాగితే బరువు తగ్గొచ్చు. రోజూ తేనెను తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుంది. తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా తయారవుతుంది.