చిత్తూరు: ములకలచెరువు మండలంలో ఈ నెల 20వ తేదీన జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ సర్కిల్ సీఐ శివాంజనేయులు తెలిపారు. సీఐ కథనం మేరకు. ములకలచెరువు మండలం దేవులచెరువు పంచాయతీ గొల్లవారిపల్లెకు చెందిన పుసులేటి శ్రీనివాసులుని పెద్దతిప్పసముద్రం మండలం చలిమామిడివారిపల్లెకు చెందిన వేణుగోపాల్ (26) బంధువైన కొట్టంవారిపల్లెకు చెందిన గుర్రం శంకర (30)లు కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారన్నారు.