రామచంద్రాపురం మండలంలోని అన్ని పంచాయతీలకు సోమవారం నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీఓ రమణ ప్రసాద్ శనివారం తెలిపారు. పంచాయతీ కార్యదర్శులతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వినాయక విగ్రహాలను ప్రతి ఇంటికీ ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు 5అడుగుల వినాయక విగ్రహాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.