మంగళగిరి: కేంద్ర ప్రభుత్వం నూతన విద్యుత్ సంస్కరణలను తీసుకువచ్చిందని వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జేవి రాఘవులు అన్నారు. మంగళగిరి కార్యాలయంలో ఆదివారం 2000 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సంస్కరణలో పోరాడి అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.