మండల కేంద్రం అమృతలూరులో వీధికుక్కలు విజృంభించి, ప్రజలపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నాయి. కుక్కల దాడిలో పలువురు మహిళలు శనివారం తీవ్రంగా గాయపడ్డారు. వీరు అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఒక వృద్ధురాలి కాలు కండ పట్టి పీకేసే ప్రయత్నం చేసింది కుక్క. కుక్క కరిచిన గాయం చూసి వైద్య సిబ్బంది, అక్కడికి వచ్చిన రోగులు కూడా భయాందోళనలకు గురయ్యారు.