మేడికొండూరు: పేరేచర్ల సెంటర్ లో వైసీపీ నాయకులు డొక్కా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నాయకులు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఇలా వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవని. డొక్కా మాణిక్య వర ప్రసాద్ కావలనే పలువురిని రెచ్చగొట్టి పార్టీలో చీలికలు చేస్తున్నారన్నారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీలో గ్రూపులను ప్రోత్సహించే వ్యక్తి ఆదనపు సమన్వయకర్త పదవికి అనర్హుడు అన్నారు.