తాడేపల్లి: 45 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు కానీ, ఏ వర్గానికి, కులానికి కానీ మేలు చేసిన దాఖలాలు లేవని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై తిరుగుబాటు తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే మొదలైందన్నారు.