అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్.పి ఆదేశాల మేరకు జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువుల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రజలను సమాయత్తం చేస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల వైపు వెళ్లకుండా గట్టి చర్యలు చేపట్టారు.
ప్రవాహానికి కొట్టుకుపోయే పరిస్థితులు అలానే వాగులు , చెరువులు దగ్గరలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆ దిశగా వారీకి సహాయ సహకారాలు ఏర్పాటు చెయ్యడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేసారు.