ఆసియా కప్ మెగా టోర్నీ గ్రూప్-ఎలో భాగంగా దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌లో తమ ఓటమికి అసలైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో విజయంతో గ్రూప్-ఎలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (43 పరుగులు) రాణించాడు. కోహ్లి (35), రవీంద్ర జడేజా (35), హార్దిక్ పాండ్యా (33) అద్వితీయమైన ఫినిషింగ్ నాక్ ఆడటంతో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు వేలాది మంది ప్రేక్షకులు, పలువురు సెలబ్రిటీలు కూడా స్టేడియానికి హాజరయ్యారు. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో చర్చనీయాంశంగా మారిన ఊర్వశి రౌతేలా కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చింది. గత కొంత కాలంగా రిషబ్ పంత్, ఊర్వశి రౌతేల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక బేబీ ఊర్వశి రాకతో కెమెరామెన్లు ఆమెపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ అనూహ్యంగా తప్పుకున్నాడు. అతని స్థానంలో రోహిత్ డీకేను ఎంచుకున్నాడు. దీంతో పంత్ డగౌట్ కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌కి ఊర్వశి పాప ఎందుకు వచ్చిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గతంలో తనకు క్రికెట్ గురించి తెలియదని.. తనకు క్రికెటర్లెవరూ తెలియదని.. అయితే సచిన్, కోహ్లీ గురించి చాలా విన్నానని.. అందుకే వాళ్లంటే తనకు చాలా గౌరవమని చెప్పింది. క్రికెట్ తెలియదని చెప్పిన ఈ చిలుక మళ్లీ ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు అంటూ నెటిజన్లు పరోక్షంగా పంత్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.