దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,030 పాయింట్ల నష్టంతో 57,803 వద్ద.. నిఫ్టీ 303 పాయింట్ల నష్టంతో 17,255 వద్ద ట్రేడవుతున్నాయి. నెస్టే, బ్రిటానియా, హెచ్యూఎల్, అపోలో ఆస్పత్రి షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్, విప్రో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.