తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. భార్య ప్రభావతి పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కామరాజ్ ప్రైవేట్ స్కూలు నడుపుతున్నాడు. అందులో యూకేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై అతడు లైంగిక దాడి చేశాడు. బాలిక అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లగా ఈ విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసి, నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.