ఏపీలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. కాగా మరో రెండు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మరో 2 గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు, ఈదురగాలులు ఉంటాయని తెలిపింది.