నేడు తెలుగు భాషా దినోత్సవం. తెలుగు వాడుక భాషా పితామహుడైన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న ఈ వేడుక జరుపుకుంటున్నాం. గ్రాంథిక భాషలో ఉండే తెలుగును వ్యవహారిక భాషలోకి తీసుకు రావడానికి గిడుగు ఎంతో కృషి చేశారు. దీని వల్ల కొద్ది మందికే పరిమితమైన చదువు అందరికీ అందుబాటులోకి వచ్చింది. తెలుగును ప్రేమించే వారికి, ఇందులోని తియ్యదనాన్ని ఆస్వాదించే వారికి శుభాకాంక్షలు.