టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వ పెద్దలే ఎరువులు, డీఏపీ కొరత సృష్టిస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లకు లోకేష్ లేఖలు రాశారు. కేంద్రం 2.25 లక్షల టన్నుల డీఏపీని కేటాయించినా ప్రయోజనం లేకుండా పోయిందని, బ్లాక్ మార్కెటింగ్, వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో కృత్రిమ కొరత ఏర్పడిందని విమర్శించారు.