నెల్లూరులో స్థిరపడిన ఎన్టీఆర్ జిల్లా వాసులు వాసిరెడ్డి కృష్ణారావు (54), సునీత (50) దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. అయితే నగదు, ఆభరణాలున్న బీరువాను దుండగులు వదిలేయగా కృష్ణారావు వద్ద ఉన్న హోటల్ నగదు మాయమయింది. డబ్బు కోసం దొంగలు హత్య చేశారా లేక కక్షల నేపథ్యంలో ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వగామ్రం వత్సవాయి మండలం ఇందుగపల్లికి తరలించారు.