మంత్రి జోగి రమేష్ పెడన మండలం నందమూరి గ్రామంలో ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందిన బెల్లంకొండ వెంకాయమ్మ కుటుంబ సభ్యులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగు రమేష్ సోమవారం పరామర్శించారు. తల్లిని కోల్పోయిన బిడ్డల దీనావస్థను చూసి చలించి పోయారు. మరోసారి మానవత్వాన్ని చాటుకుని కుటుంబ పోషణకు కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఉద్యోగ బాధ్యతలు అప్పగించాలని మండల అధికారులను ఆదేశించారు. సొంతంగా రూ.50,000 చెక్కు అందజేశారు.