ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు బర్త్ రిజిస్ట్రేషన్ తరహాలోనే శిశు ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను చేపట్టడానికి ఆసుపత్రులకు అవసరమైన ట్యాబులు, ఫింగర్ ప్రింట్ స్కానర్ లను సమకూర్చనున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశు ఆధార్ ఎన్రోల్మెంట్ చేపట్టనున్నారు.