అసెంబ్లీలోనే రాత్రంతా ఉండాలని ఆప్ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసనకు దిగారు. రాత్రంతా సభలోనే ఉండాలని నిర్ణయించారు. నోట్ల రద్దు స్కామ్ లో సక్సేనా ప్రమేయం ఉందని, ఈడీ దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశారు.