తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. 5 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం శ్రీవారిని 67,950 మంది భక్తులు దర్శించుకోగా 31,407 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.74 కోట్లు వచ్చిందని తెలిపారు.