ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కి ముందు టీమిండియాకు శుభవార్త. గాయం కారణంగా ఆసియా కప్-2022కు దూరమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లకు జస్ప్రీత్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో వారం రోజులు గడిపాడు. గాయం నుంచి కోలుకుని స్వగ్రామం ముంబై కి చేరుకున్నట్లు తెలుస్తుంది.