కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమడక గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో తెదేపా ఇంచార్జి పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో పెరిగిన ధరల వల్ల సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ధరలు చూడలేదని అన్నారు. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలను మరియు పెట్రోలు డీజల్ ధరలను నిరసిస్తూ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. మూడేళ్ళ వైసీపీ పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలపై ప్రభుత్వం మోపుతున్న అధిక ధరల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షులు బోరెడ్డి వెంకట రమణా రెడ్డి, తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.